భృంగి వాహనంపై మల్లన్న విహారం
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:32 AM
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉదయం ఉభయ దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లకు ఉదయం నుంచి ప్రత్యేక పూజాక్రతువులు జరిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల అనంతరం మంగళవాయిద్యాలు, కోలాటాలు, డప్పు విన్యాసాల మధ్య భృంగివాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన మంగళవారం స్వామిఅమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.