‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’పై దాడికి యత్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాల మహానాడు
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:50 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగిశ...
విజయనగరం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలకు వాస్తవాలు చెప్పే హక్కు ఉందని, వైసీపీ శ్రేణులు హైదరాబాదులోని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై దాడికి యత్నించడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పించడమేనని, అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.