Share News

మేకిన్‌ ఇండియా ‘ఎక్మో’ అందుబాటులోకి రావాలి

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:17 AM

గుండె, ఊపిరితిత్తులు విఫలమైనప్పుడు రోగుల ప్రాణాలు కాపాడగల అత్యాధునిక సాంకేతికత ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) మెషిన్‌ అని....

మేకిన్‌ ఇండియా ‘ఎక్మో’ అందుబాటులోకి రావాలి

  • గుండె, ఊపిరితిత్తుల చికిత్సల్లో ఎక్మో మెషిన్‌ది కీలక పాత్ర

  • ఎక్మో సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి డాక్టర్‌ ప్రణయ్‌ ఓజా

గుంటూరు మెడికల్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): గుండె, ఊపిరితిత్తులు విఫలమైనప్పుడు రోగుల ప్రాణాలు కాపాడగల అత్యాధునిక సాంకేతికత ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) మెషిన్‌ అని ఎక్మో సొసైటీ ఆఫ్‌ ఇండియా కోర్సు డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రణయ్‌ ఓజా తెలిపారు. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌, గుంటూరు శాఖ ఆధ్వర్యంలో.. ఎక్మో సొసైటీ ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆదివారం నిర్వహించిన ఎక్మోకాన్‌ వైద్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్మో మెషిన్‌ వాడకం 50 రెట్లు తక్కువేనని చెప్పారు. ఇది ఖరీదైన చికిత్స కావడం, వైద్య నిపుణులకు తగినంత శిక్షణ లేకపోవడం దీనికి కారణమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా దేశీయంగా ఎక్మో మెషిన్లు తయారుచేస్తే భవిష్యత్తులో ఇది అన్ని వర్గాలకూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరో డైరెక్టర్‌ వెంకట్‌ గోయల్‌ మాట్లాడుతూ... ఎక్మోపై రోగులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 05:18 AM