పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:05 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావర ణంలో పూర్తి చేసేందుకు ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సిరి
ఎస్పీ, జేసీతో కలిసి సా్ట్రంగ్ రూమ్,
కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
ఆదోని, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావర ణంలో పూర్తి చేసేందుకు ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. ఆదోని మండలం విరూపాపురం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్ రూమ్, కౌం టింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌లతో కలిసి ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ పెట్టెలు సురక్షితంగా భద్రపరిచేందుకు స్ర్టాంగ్ రూమ్‌లలో అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 24 గంటల పర్యవేక్షణ ఉం డాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌం టింగ్ కేంద్రం వద్దకు అనధికారిక వ్యక్తులు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ చర్యలు చేపడతామన్నారు. జేసీ నూరుల్‌ఖమర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతిఒక్క అధికారి, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదోని డివిజన్ రెవెన్యూ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు, కళాశాల ప్రతినిధులు తదితరులున్నారు.
పత్తికొండలో డిగ్రీకళాశాలలో..
పత్తికొండ: ఎన్నికల నియమావళిననుసరించి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు కౌంటింగ్ నిర్వహణకు పక్కాప్రణాళికతో ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ సిరి అన్నారు. సోమవారం పత్తికొండ డిగ్రీకళాశాలలో సా్ట్రంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంతపాటిల్, జేసీ నూరుల్‌ఖమల్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికొండ డిగ్రీకళాశాలలో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల కౌంటింగ్ జరుగుతుందన్నారు. కౌంటింగ్ రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఓబులేసు, డీఎస్పీ వంశీధర్, నాలుగు మండలాల అధికారులు ఉన్నారు.
ఆలూరు జూనియర్ కళాశాలలో..
ఆలూరు: పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్, స్ర్టాంగ్ రూమ్‌లను కలెక్టర్ సిరి పరిశీలించారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్, జాయింట్ కలెక్టర నూరుల్ ఖమర్‌తో కలిసి కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిటర్నింగ్ అధికారులతో (ఆర్‌ఓలు) సమావేశమై ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ మన్మఽథవిజయ్, ఆర్వో ఆనంద్‌కుమార్, తహసీల్దార్ శోభాసువర్ణమ్మ, ఎంపీడీవోలు మద్దిలేటిస్వామి, అల్లాబకాష్, గీతావాణి పాల్గొన్నారు.