పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:14 PM
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కలెక్టర్ రాజకుమారి అధికా రులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
డోన టౌన, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కలెక్టర్ రాజకుమారి అధికా రులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో ఎస్పీ సునీల్ షెరాన, జేసీ కార్తీక్, డీఎస్పీ శ్రీనివాసులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ కొత్తబురుజు గ్రామానికి వెళ్లే గ్రామాల పరిసరాలు పరిశు భ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనికేషన సదుపాయాల కోసం బీఎస్‌ఎనఎల్ ద్వారా 26 కిలోమీటర్ల లైన ఏర్పా టుచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలుగు ప్రదేశా ల్లో కూల్ క్యాంపులు ఏర్పాటుచేయాలన్నారు. ప్రతి క్యాంపులో తాగు నీరు, ఆర్వో వాటర్, ప్లాస్టిక్ గ్లాసులు, డస్ట్‌బినలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు సంబందించిన వివరా లను క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్పీ సునీల్ షెరాన మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లలో విద్యుత తీగలు, వైరింగ్ వంటి అంశాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పా ర్కింగ్ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు, కాన్వాయ్‌కు మంచి స్థితిలో ఉన్న వాహనాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆర్డీవో సహా సంబందిత అధికారులకు సూచించారు. ఆర్డీవో కేపీ నరసిం హులు, తహసీల్దార్లు రవి, నాగముని, డీఎల్‌డీవో నరసింహారెడ్డి, ఎంపీడీవోలు, సర్పంచులు పాల్గొన్నారు.