Share News

ఎమ్మిగనూరులో భారీ చోరీ

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:26 PM

మ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు లక్ష్మిదేవి తెలిపిన వివరాల మేరకు.. తాము మాచాని సోమప్ప ఉన్నత పాఠశాల ప్రాంతం లక్ష్మీపేట కాలనీలో గత నాలుగేళ్ల నుంచి నివాసం ఉంటున్నామన్నారు.

ఎమ్మిగనూరులో భారీ చోరీ

ఫ 40 తులాల వెండి, రూ.20 వేల నగదు అపహరణ

ఫ విచారిస్తున్న పట్టణ పోలీసులు

ఎమ్మిగనూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి)ః ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు లక్ష్మిదేవి తెలిపిన వివరాల మేరకు.. తాము మాచాని సోమప్ప ఉన్నత పాఠశాల ప్రాంతం లక్ష్మీపేట కాలనీలో గత నాలుగేళ్ల నుంచి నివాసం ఉంటున్నామన్నారు. అయితే తాము ఇంటి తలుపులు, గేటుకు తాళాలు వేసి గత పది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లామన్నారు. దేవుళ్లను దర్శించుకొని మంగళవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నామన్నారు. ఇంటి గేటుకు ఉన్న తాళం అలాగే ఉందని, అయితే ఇంటి తలుపుకు ఉన్న తాళం పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూశామన్నారు. ఇంట్లో పెట్టెల్లోని సామాగ్రితో పాటు మిగతా సామాగ్రి చెల్లా చెదురుగా పడి ఉండడంతో తమకు అనుమానం వచ్చిందన్నారు. పెట్టెలకు వేసిన తాళాలు పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పెట్టెను తెరచి చూసే సరికి అందులో ఉన్న 40తులాల వెండి సామాగ్రి, రూ.20వేల నగదు కనిపించలేదన్నారు. దీంతో దొంగతనం జరిగిందని గ్రహించామన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై పట్టణ సీఐ కంబగిరి రాముడు ను వివరణ కోరగా చోరీ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సంఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 11 , 2026 | 11:26 PM