మేజర్ మల్లాకు రూ.1.25 కోట్ల బహుమతి
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:14 AM
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్లా రామగోపాల్ నాయుడుకి ప్రభుత్వం 1.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది.
‘కీర్తి చక్ర’ అవార్డుకు అందించిన ప్రభుత్వం
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్లా రామగోపాల్ నాయుడుకి ప్రభుత్వం 1.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేజర్ మల్ల రామగోపాల్ నాయుడుకి కేంద్ర ప్రభుత్వం 2024లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ‘కీర్తి చక్ర’ అవార్డు ప్రదానం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డ్మ్ ఫోర్సుల్లో ‘చక్ర’ అవార్డు గ్రహీతలకు నగదు బహుమతులు ప్రకటించింది. ఈమేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది.