జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా మేజర్ జనరల్ శ్రీనివాస్
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:22 AM
తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా (టీఏఎస్‌ఏ) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)గా మేజర్ జనరల్ జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. బుధవారం ...
విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా (టీఏఎస్‌ఏ) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)గా మేజర్ జనరల్ జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆర్కే బీచ్‌రోడ్డులోని అమరవీరుల స్మృతిచిహ్నం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఆయన మిలటరీ లోకల్ అథారిటీ అధికారిగా వ్యవహరిస్తారు. పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, మాజీ ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలకు బాధ్యత వహిస్తారు. కాగా.. మేజర్ జనరల్ శ్రీనివాస్ ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందు ఆయన సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజ్ కమాండెంట్‌గా పనిచేశార