భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:55 PM
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని సుబ్రమణ్యేశ్వర 2 పాలిమర్ సంచుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. సుమారు రూ 3 కోట్ల విలువ చేసే మిషన్లు దగ్థమయ్యాయి.
కోవెలకుంట్ల పాలిమర్ సంచుల ఫ్యాక్టరీలో మంటలు
మిషన్లు, రూప్ టాప్ సోలార్ పూర్తిగా దగ్థం
రూ 3 కోట్ల ఆస్తి నష్టం
ఫ ప్రాణాలతో బయటపడిన కార్మికులు
కోవెలకుంట్ల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని సుబ్రమణ్యేశ్వర 2 పాలిమర్ సంచుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. సుమారు రూ 3 కోట్ల విలువ చేసే మిషన్లు దగ్థమయ్యాయి. వీటితో పాటు రూప్ టాప్ సోలార్ కూడా పూర్తిగా దగ్థమై ఆస్తి నష్టం సంభవించింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి రూ కోట్లు వెచ్చించి సుబ్రమణ్యేశ్వర 2 పాలిమర్ సంచుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అందులో సుమారు 250 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రతిరోజు లాగానే సోమవారం ఉదయం 8 గంటలకు కార్మికుల సంచుల ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని అందులో ఉన్న మిషన్లను ఆన చేశారు. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో పెద్ద మంటలు ఎగిసిపడ్డాయి. అందులో పని చేసే కార్మికులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. పాలిమర్ సంచుల ఫ్యాక్టరీలో తయారీకి ఉపయోగించే ఆటోమేటిక్ ప్రింటింగ్ మిషన్లు రెండు, మ్యానువల్ ప్రింటింగ్ మిషన్లు రెండు పూర్తిగా దగ్థమయ్యాయి. అలాగే రూప్ టాప్ సోలార్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ ఇంజన సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని మంటలను ఆర్పారు. సీఐ హనుమంతు నాయక్, ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ యజమాని సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యుత షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, రూ. మూడు కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.