Share News

వైభవంగా మహానందీశ్వరుని రథోత్సవం

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:42 AM

మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వైభవంగా రథోత్సవం జరిగింది.

   వైభవంగా మహానందీశ్వరుని రథోత్సవం

మహానంది, పిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వైభవంగా రథోత్సవం జరిగింది. ముందుగా ఆలయంలోని మహానందీశ్వరుని ఉత్సవమూర్తుల విగ్రహాలతో పాటు, పెళ్లిపెద్దగా వ్యవహా రించిన నంద్యాల బ్రహ్మనందీశ్వరుని ఉత్సవమూర్తుల విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలతో ప్రత్యేక పల్లకిలో ఉత్సవమూర్తుల విగ్రహాలను రఽథశాల వద్దకు చేర్చి రథంలో ఆశీనులు చేశారు. ఆనవాయితీ ప్రకారం కుమ్మరి వీరయ్య కుంభంతో రఽథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసారు. నంద్యాల జిల్లా న్యాయాధికారులు అమ్మన్నరాజు, శ్రీనివాసులు, ఆర్డీవో చల్లా విశ్వనాధ్‌, ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌ రమాదేవి, ఏఈవో మధులు రఽథానికి ప్రత్యేక పూజలు చేసి ముందుకు లాగి ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మహానందీశ్వరుని రధోత్సవం ఆలయ మాడవీధుల చుట్టూ రధోత్సవం భక్తుల శివనామస్మరణతో 6,30 గంటల వరకు కొనసాగింది. రఆలయ అర్చకులు మామిళ్ళపల్లి రాఘవేంద్రశర్మ వాఖ్యాతగా వ్యవహ రించారు. నంద్యాల రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రామ్మోహనరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వివిధ కళాకారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకొన్నాయి.

Updated Date - Feb 18 , 2026 | 12:42 AM