Mahakumbhabhishekam: మార్చి 6, 7, 8 తేదీల్లో దుర్గగుడిలో మహాకుంభాభిషేకం
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:17 AM
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈ ఏడాది మహాకుంభాభిషేకం నిర్వహించాలని దేవస్థానం...
విచ్చేయనున్న కంచి కామకోటి పీఠాధిపతి
ఇంద్రకీలాద్రి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈ ఏడాది మహాకుంభాభిషేకం నిర్వహించాలని దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించింది. మహా కుంభాభిషేకం నిర్వహణపై కంచి కామకోటి పీఠం నుంచి అనుమతి వచ్చింది. మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మహా కుంభాభిషేక కార్యక్రమానికి కంచి పీఠాధిపతి విచ్చేస్తారు. ప్రధాన కార్యక్రమం మార్చి 6వ తేదీ ఉదయం ప్రారంభమవుతుంది.