జగన్ ఇంట్లో అనంతబాబు
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:14 AM
వైసీపీ అధినేత జగన్ ఇంట్లో దాచిపెట్టిన అనంత బాబును రెండు రోజుల్లో చట్టానికి అప్పగించాలి. లేకపోతే మంగళగిరిలోని వైసీపీ కేంద్ర...
రెండు రోజుల్లో చట్టానికి అప్పగించాలి.. మహాసేన రాజేశ్ అల్టిమేటం
కాకినాడ సిటీ/ప్రత్తిపాడు, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అధినేత జగన్ ఇంట్లో దాచిపెట్టిన అనంత బాబును రెండు రోజుల్లో చట్టానికి అప్పగించాలి. లేకపోతే మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని వేలాదిమంది దళితులతో ముట్టడిస్తాం’ అని మహాసేన రాజేశ్ అల్టిమేటం జారీ చేశారు. అనంతబాబును మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు.