Share News

సీబీఐ దర్యాప్తునకు మాదిగ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ డిమాండ్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:49 AM

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, ఇన్‌స్పెక్టర్‌ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియో చేసిన పెరుగుపోగు కాంత్రికుమార్‌ మృతి ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని..

సీబీఐ దర్యాప్తునకు మాదిగ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ డిమాండ్‌

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, ఇన్‌స్పెక్టర్‌ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియో చేసిన పెరుగుపోగు కాంత్రికుమార్‌ మృతి ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మాదిగ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ డిమాండ్‌ చేసింది. ఈ రెండు ఘటనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆ సంస్థ చైర్మన్‌ ఎ.వి.పటేల్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ మృతదేహాన్ని వెలికితీసి మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ రెండు ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ పోలీసు కమిషనర్‌ సహా సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 04:50 AM