వైసీపీ నాయకులు భయపడుతున్నారు: మాధవీరెడ్డి
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:32 AM
సీఎం చంద్రబాబు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అన్నారు.
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆయుధం పిచ్చోడి చేతిలో ఉడడానికి, మంచోడి చేతిలో ఉండడానికి తేడా పట్టాదారు పాసుపుస్తకాలే. భూముల రీసర్వే పేరుతో జగన్ చేసిన దోపిడీలు, దుర్మార్గాలు, అక్రమాలు ప్రజలు మర్చిపోలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూముల్ని జగన్ దోచుకున్నారు’ అని మాధవీ రెడ్డి విమర్శించారు.