Share News

ఎక్సైజ్‌ విచారణకు హాజరైన జయచంద్రారెడ్డి

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:06 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ములకలచెరువు నకిలీమద్యం కేసులో నిందితులైన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రారెడ్డి..

ఎక్సైజ్‌ విచారణకు హాజరైన జయచంద్రారెడ్డి

  • నకిలీ మద్యం కేసులో రెండు గంటలు విచారించిన అధికారులు

మదనపల్లె టౌన్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ములకలచెరువు నకిలీమద్యం కేసులో నిందితులైన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిలను మదనపల్లెలో ఎక్సైజ్‌ అధికారులు విచారించారు. కేసులో ఏ17, ఏ18గా ఉన్న జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి ఇప్పటి వరకు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టుకు వెళ్లి జూలై 31వరకు అరెస్టు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం మదనపల్లె ఎక్సైజ్‌ సూపరింటెండెంటు కార్యాలయానికి వారు వచ్చారు. విచారణ అధికారి ఏఈఎస్‌ జోగేంద్ర 2గంటల పాటు నిందితులిద్దరినీ విచారించారు.

Updated Date - Jun 21 , 2026 | 06:06 AM