రఘురామ కృష్ణరాజు నుంచి ప్రాణహాని ఉంది
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:41 AM
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పారిశ్రామికవేత్త అగతా..
రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించండి
హైకోర్టును ఆశ్రయించిన పారిశ్రామికవేత్త మాదల శ్రీనివాసు
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పారిశ్రామికవేత్త అగతా ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్/డైరెక్టర్ మాదల శ్రీనివాసు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. 2ప్లస్2 సెక్యూరిటీ కల్పించేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు. ఈ ఏడాది జూలై 31న రఘురామ పంపినట్లుగా చెబుతున్న కొంతమంది గూండాలు గుంటూరులోని తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఈ ఘటనపై అదే రోజు తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పట్టాభిపురం పోలీసులను ఆదేశించాలని కోరారు.