Share News

లారీ క్లీనర్‌కు మరణించే వరకూ జైలు

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:07 AM

ఐదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మరణించే వరకూ కఠిన కారాగార శిక్ష విధిస్తూ మచిలీపట్టణం పొక్సో కోర్టు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ కిశోర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

లారీ క్లీనర్‌కు మరణించే వరకూ జైలు

  • ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం కేసులో మచిలీపట్నం పోక్సో కోర్టు తీర్పు

ఏలూరు క్రైం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మరణించే వరకూ కఠిన కారాగార శిక్ష విధిస్తూ మచిలీపట్టణం పొక్సో కోర్టు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ కిశోర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు రూరల్‌ మండలం పల్లెర్లమూడిలో.. దంపతులు, వారి ఐదేళ్ల కుమార్తె 2024 ఆగస్టు 4వ తేదీ రాత్రి ఆరుబయట పడుకున్నారు. తల్లిదండ్రులు, నానమ్మతో బాలిక వరండాలో నిద్రిస్తుండగా ఒక అగంతకుడు చిన్నారిని అపహరించుకుపోయి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి సెల్‌పోన్‌ ఎత్తుకుపోయాడు. ఒంటిపై దుస్తులు లేకుండా అర్ధరాత్రి వేళ బాలిక ఒంటరిగా ఏడుస్తూ ఉండడాన్ని గ్రామస్థులు చూసి, తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు బాలికను నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటి ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సీఐ కె.రామకృష్ణ దర్యాప్తు చేపట్టి, ఈ నేరానికి పాల్పడిన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోటకు చెందిన మిర్యాల జయరావు(33) అనే లారీ క్లీనర్‌ను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో అతనికి బెయిల్‌ రాకుండా కోర్టు మానిటరింగ్‌సెల్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంది. నేరం రుజువు కావడంతో ముద్దాయికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ మచిలీపట్టణం స్పెషల్‌ పోక్సో సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated Date - Aug 26 , 2026 | 06:09 AM