సోషల్ మీడియా ద్వారా పరిచయమై..!
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:25 AM
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన లైంగిక దాడి కేసులో బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తే నింది తుడని గుర్తించినట్లు...
మాచర్ల ఘటనలో సన్నిహితుడే నిందితుడు
నరసరావుపేట లీగల్, మాచర్ల, ఏప్రిల్ 9, (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన లైంగిక దాడి కేసులో బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తే నింది తుడని గుర్తించినట్లు ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఆయన కథనం మేరకు.. ‘పల్నాడు జిల్లా రాజుపాలేనికి చెందిన నామాల శ్రీను వాసు అలియాస్‌సంజు అలియాస్ శ్రీను బాధిత ఉద్యోగినికి సోషల్ మీడియా ద్వారా పరిచయమై, సన్నిహితుడిగా మారాడు. ఆమె ఆహ్వానం మేరకు ఈ నెల రెండో తేదీన మాచర్లలోని ఆమె ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక శ్రీను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండోసారి లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహం చెంది ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు, కాళ్లు చున్నీతో కట్టేసి పరారయ్యాడు. కొద్దిసేపటికి కోలుకున్న బాధితురాలు.. తన స్నేహితుడికి సమాచారం ఇవ్వగా, అతడు హుటాహుటిన వచ్చి, స్థానిక మహిళ సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాల నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడు నామాల శ్రీను అని నిర్థారించారు. కాగా, నిందితుడిని గురువారం మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని గురజాల సబ్‌జైలుకు తరలించారు.