Share News

వైసీపీ విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది: ఎంఏ షరీఫ్‌

ABN , Publish Date - May 14 , 2026 | 05:25 AM

అధికారం కోల్పోయిన కక్షతో వైసీపీ నేతలు ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు...

వైసీపీ విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది: ఎంఏ షరీఫ్‌

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయిన కక్షతో వైసీపీ నేతలు ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్‌ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కడప ఆల్మాస్‌ సెంటర్‌ వివాదం వెనుక వైసీపీ కుట్రలు ఉన్నాయి. రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. వైసీపీ నాయకుల మాటలు నమ్మి అతి ఉత్సాహం ప్రదర్శించిన అమాయకులు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుపోయారు’ అని తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 05:25 AM