Share News

Lucky Draw: లక్కీ డ్రాలో రూ. 25 లక్షల కారు..

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:38 AM

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం కోడిపందేల బరిలో పొత్తూరి నరసింహరాజుకు అదృష్టం వరించింది. కోడిపందేల నిర్వాహకులు టోకెన్‌ ఒక్కింటికీ రూ.25 వేల చొప్పున..

Lucky Draw: లక్కీ డ్రాలో రూ. 25 లక్షల కారు..

  • స్కార్పియో గెలుచుకున్న ‘పొత్తూరి’

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం కోడిపందేల బరిలో పొత్తూరి నరసింహరాజుకు అదృష్టం వరించింది. కోడిపందేల నిర్వాహకులు టోకెన్‌ ఒక్కింటికీ రూ.25 వేల చొప్పున మొత్తం వంద టోకెన్లను పంపిణీ చేశారు. మొత్తం 25 లక్షల రూపాయలు వసూలు కాగా, మహేంద్ర స్కార్పియో లక్కీ డ్రాలో ఏర్పాటు చేశారు. కోడి పందేల మూడో రోజు శుక్రవారం లక్కీ డ్రా తీయగా, ఫత్తేపురం సొసైటీ అధ్యక్షుడు పొత్తూరి నరసింహరాజు అండ్‌ టీమ్‌ సభ్యులను విజయం వరించింది. స్థానిక ఎమ్మె ల్యే పత్సమట్ల ధర్మరాజు చేతుల మీదుగా విజేత పొత్తూరి నరసింహరాజు టీమ్‌కు స్కార్పియో తాళం చెవిని అందజేశారు. కోడి పందేలలో కూడా పొత్తూరి టీమ్‌ హవా నడిచింది. సంక్రాంతి 3 రోజుల్లో తొలిరోజు ఆయన టీమ్‌ ఆరు జోడీలకుగాను 3 విజేతలు కాగా, రెండో రోజు 2 జోడీలూ విజేతలయ్యాయి. చివరి రోజు ఆరు జోడీలకుగాను 5 విజేతలుగా నిలిచాయి. ఒకటి సమంగా నిలిచింది. దీంతో పొత్తూరి టీమ్‌ లీడ్‌ విన్నర్‌గా నిలిచింది.

Updated Date - Jan 17 , 2026 | 03:39 AM