నేడు మరో అల్పపీడనం
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:55 AM
అల్పపీడనం గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో స్థిరంగా కొనసాగుతోంది.
రేపటి నుంచి రాయలసీమకు వర్షసూచన
విశాఖపట్నం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అల్పపీడనం గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత ఇది బలపడుతుందా?,లేదా?...అనే దానిపై మాత్రం ప్రకటన చేయలేదు. కానీ ఈ నెల 21 నుంచి దక్షిణ తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఉత్తర తమిళనాడుకు ఆనుకుని రాయలసీమలో ఈనెల 21 నుంచి, దక్షిణ కోస్తాలో 22 నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది.