తమిళనాడు సమీపాన అల్పపీడనం
ABN , Publish Date - May 13 , 2026 | 04:41 AM
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మంగళవారానికి తమిళనాడు చేరువలోకి వచ్చింది. అక్కడి నుంచి రానున్న 48 గంటల్లో ఈశాన్యంగా పయనించే క్రమంలో బలపడుతుందని...
48 గంటల్లో బలపడే అవకాశం
విశాఖపట్నం, అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మంగళవారానికి తమిళనాడు చేరువలోకి వచ్చింది. అక్కడి నుంచి రానున్న 48 గంటల్లో ఈశాన్యంగా పయనించే క్రమంలో బలపడుతుందని, తరువాత దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా, మంగళవారం కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఎండతీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.