Share News

గోరంట్లలో అట్టహాసంగా పోటీలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:55 PM

గోరంట్లలో లక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీడీపీ నాయకులు రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పొటీలు ఏర్పాటు చేశారు.

    గోరంట్లలో అట్టహాసంగా పోటీలు
బరిలో తలపడుతున్న పొట్టేళ్లు

ప్రారంభించిన ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు రూరల్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గోరంట్లలో లక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీడీపీ నాయకులు రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పొటీలు ఏర్పాటు చేశారు. దివంగత ఎంపీపీ రాజవర్థనరెడ్డి జ్థాపకార్థం ఏర్పాటు చేసిన పోటీలను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎద్దుల బండలాగుడు పోటీలో వెంకటగిరికి చెందిన బీఎల్‌కే బుల్స్‌, శశాంక్‌శ్రేయ ఎద్దులు అత్యధికంగా 3,750 అడుగుల దూరంలాగి రూ. 40 వేలు గెలుపొందాయి. రెండో స్థానంలో నిలిచిన గట్టు మండలం, రాయపురానికి చెందిన నల్లారెడ్డి ఎద్దులు రూ. 30 వేలు కైవసం చేసుకున్నాయి. తర్వాతి విజేతలకు వరుసగా రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు దాతలు అందజేశారు. అలాగే పొట్టేళ్ల ఢీ పోటీలో విజేతలైన యజమానులకు టీడీపీ నాయకుడు మధుసూదననాయుడు రూ. 20 వేలు, శ్రీనివాసులు రూ. 10 వేలు నగదు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి రాజు, డీసీ చైర్మన చంద్రశేఖర్‌, సద్దల శ్రీనివాసులు, నారాయణ, కురువ శ్రీనివాసులు, పెద్దగిడ్డయ్య, చిన్ననారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:55 PM