Share News

కొలువుదీరిన గణనాథులు

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:29 AM

వినాయక చవితిని ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

కొలువుదీరిన గణనాథులు
ఆదోని: బసవేశ్వర సర్కిల్‌లో వెలిసిన గణనాథుడికి పజలు చేస్తున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు

వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం

భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యలకు పూజలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

వినాయక చవితిని ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. తమ గృహాల్లో చిన్న ప్రతిమల గణపతి మూర్తులను ప్రతిష్టింపజేసి, ధూప దీప నైవేద్యాలతో పూజలను శాసో్త్రక్తంగా నిర్వహించారు. సర్వ విఘ్నాలు తొలగిపోవాలని భక్తిప్రపత్తులతో గణనాథున్ని పూజించారు. అం బరాన్ని అంటే సంబరాలతో ఆయా ప్రాంతాల్లోని ఉత్సవ కమిటీల నిర్వాహకులు పార్వతీ నందనుడి మండపాలకు తరలించి, పూజలతో ఉత్సవాలుప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా భారీ విగ్రహాలను నెలకొల్పారు. ఈ ఏడాది గణేశ ఉత్సవాల్లో విగ్రహాలు ఆకర్షణీయంగా నిలిచాయి. విభిన్న రూపా ల్లో వినాయక ప్రతిమలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. గణేశ ఉత్సవమూర్తుల చేతుల్లో పెట్టే లడ్డూ ప్రసాదాలు కూడా భారీ సై జుల్లో ఏర్పాటు చేశారు. వివి ధ వాడలు, వీధుల్లో, నాలుగు రోడ్ల చౌరస్తాలలో విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. గణేశ మంటపాలను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్తు దీపాలతో తీర్చిదిద్దారు. విగ్రహం నెలకొల్పిన వేదికను అలంకరణ సామగ్రితో ప్రత్యేకంగా రూపొందించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖులు స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల సందడి కనిపిస్తోంది. గణేశ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, రాత్రి అల్పాహారాల పంపిణీ చేపట్టారు.

ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌

Updated Date - Sep 16 , 2026 | 12:29 AM