Share News

కల్తీ నెయ్యిపై టీం-11 కెప్టెన్‌ దుష్ప్రచారం

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:09 AM

కల్తీ మద్యానికి.. కల్తీ నెయ్యికి.. బాబాయ్‌ హత్యకు టీం-11(జగన్‌ అండ్‌ కో) బ్రాండ్‌ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు.

కల్తీ నెయ్యిపై టీం-11 కెప్టెన్‌ దుష్ప్రచారం

  • తిరుమల లడ్డూతో పాటు కల్తీలన్నిటికీ వారే బ్రాండ్‌ అంబాసిడర్లు: లోకేశ్‌

  • దేవుడిని అడ్డుపెట్టుకుని 250 కోట్లు స్వాహా

  • బాబాయిని చంపి గుండెపోటన్నారు

  • అవినాశ్‌ దోషి అని జగన్‌కు తెలుసు

  • అయినా ఆ నెపాన్ని చంద్రబాబుపై వేశారు

  • సరిగా తిప్పికొట్టలేక నాడు నష్టపోయాం

  • బూత్‌ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యం.. వర్క్‌షాపులో లోకేశ్‌ స్పష్టీకరణ

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కల్తీ మద్యానికి.. కల్తీ నెయ్యికి.. బాబాయ్‌ హత్యకు టీం-11(జగన్‌ అండ్‌ కో) బ్రాండ్‌ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రూ.250 కోట్లు దోచేశారని.. పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసింది కాక తమకు క్లీన్‌చిట్‌ వచ్చిందంటూ టీం-11 కెప్టెన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని సమర్ధంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ టీం-11 కెప్టెన్‌ ఏం చదివాడో తనకు అర్ధం కావడం లేదని, చార్జిషీటు ఇంగ్లి్‌షలో ఉందని, అసలాయనకు ఇంగ్లిష్‌ వచ్చా అని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం బూత్‌ మేనేజ్‌మెం ట్‌ వర్క్‌షాపులో లోకేశ్‌ మాట్లాడారు. ‘2019లో బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటుగా ప్రచారం చే శారు. వివేకాని అవినాశ్‌రెడ్డి చంపాడని జగన్‌కు తెలుసు. అయినా చంద్రబాబుపై దుష్ప్రచారం చేశారు. అప్పట్లో సరైన సమయంలో దీనిని తిప్పికొట్టకపోవడంతో నష్టపో యాం’ అని చెప్పారు. ‘పార్టీ సొంతిల్లు. ప్రభుత్వం అద్దె ఇల్లు లాంటిది. సమాజంలో గానీ, ప్రభుత్వంలో గానీ మన కు గౌరవం దక్కుతుందంటే దానికి కారణం పార్టీయేనన్నది గుర్తు పెట్టుకోవాలి.


సీనియర్లను, జూనియర్లను సమానంగా గౌరవిస్తాం. టీడీపీకి ఎన్నికల బూత్‌ గుండెకాయలాంటిది. 2024లో వేవ్‌ వచ్చినా కొన్ని కారణాల వల్ల కొన్ని బూత్‌లలో గెలవలేకపోయాం. దానికి కారణాలు అన్వేషించాలి. గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలనే లక్ష్యంతో ఈ వర్క్‌షాపును చేపట్టాం. బూత్‌ స్థాయిలో బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. దీని కి మంగళగిరి, గాజువాక నియోజకవర్గాలే ఉదాహరణ. రాబోయే రోజుల్లో బూత్‌ స్థాయిలో నేతల పనితీరు బేరీజు వేస్తాం. బూత్‌ స్థాయిలో బలోపేతం కావడం మీ బాధ్యత’ అని స్పష్టంచేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని.. గుజరాత్‌, ఒడిసా రాష్ట్రాలే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం చాలా నష్టపోయిందని, పార్టీపరంగానూ చాలా కష్టనష్టాలను ఎదుర్కొన్నామన్నారు.

విడాకులు ఉండవు.. మిస్‌ఫైర్‌లూ ఉండవు

సమస్యలుంటే నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని టీడీపీ నేతలకు లోకేశ్‌ సూచించారు. అలిగితే నష్టపోయేది పార్టీ.. రాష్ట్రమేనని చెప్పారు. కూటమిలో విడాకు లు ఉండవు.. మిస్‌ ఫైర్‌లూ ఉండవన్నారు. మిత్రుల నడు మ సమస్యలుంటే కూర్చుని పరిష్కరించుకోవాలని, గ్రామస్థాయి వరకు ఇదే విధానాన్ని అనుసరించాలని తెలిపారు. మన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:11 AM