Share News

ఢిల్లీలో కూటమి ఎంపీలతో లోకేశ్‌ భేటీ

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:46 AM

రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కూటమి ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఉదయం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖ ర్‌ నివాసంలో అల్పాహార విందు సమావేశం జరిగింది.

ఢిల్లీలో కూటమి ఎంపీలతో లోకేశ్‌ భేటీ

  • కల్తీ నెయ్యి నివేదికపై చర్చ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కూటమి ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఉదయం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖ ర్‌ నివాసంలో అల్పాహార విందు సమావేశం జరిగింది. దీనిలో మరో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, టీడీపీ ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, బీద మస్తాన్‌రావు, కేశినే ని చిన్ని, బీకే పార్థసారథి, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్‌, బైరెడ్డి శబరి, శ్రీభరత్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జీఎం హరీశ్‌, బీజేపీ ఎంపీ పాక వెంకటసత్యనారాయణ, జనసే న ఎంపీ బాలశౌరి, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ పాల్గొన్నారు. తిరుమల కల్తీనెయ్యి వ్యవహరంపై సిట్‌ నివేదిక, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై చర్చించారు. మధ్యాహ్నం భోజన సమయంలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలి అధికారిక నివాసంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతోపాటు మరికొందరు యువ ఎంపీలతో లోకేశ్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతం పార్లమెంటులో చోటుచేసుకుంటున్న ఘటనలు చర్చకు వచ్చాయి. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏమేం చేయవచ్చో లోకేశ్‌తో చర్చించినట్లు తేజస్వి సూర్య ఆ తర్వాత ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ఏపీలో మంత్రి లోకేశ్‌ అమలు చేస్తున్న పాలనా విధానాల గురించి అడిగి తెలుసుకున్నానని.. ఇక నుంచి తరచుగా కలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సుస్థిర, సంపన్నమైన ఏపీని నిర్మిస్తు న్న లోకేశ్‌కు శుబాకాంక్షలు తెలిపారు. ఇక రాత్రికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నివాసంలో విందుకు లోకేశ్‌ హాజరయ్యారు. తర్వాత రాష్ట్రానికి బయల్దేరారు.

Updated Date - Feb 05 , 2026 | 06:47 AM