అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేలా: లోకేశ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:00 AM
భారతదేశ వేగవంతమైన ప్రగతి, అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా, దీర్ఘకాలిక ప్రణాళికా లక్ష్యాలను అందుకునేలా కేంద్ర బడ్జెట్ ఉంది.
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘భారతదేశ వేగవంతమైన ప్రగతి, అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా, దీర్ఘకాలిక ప్రణాళికా లక్ష్యాలను అందుకునేలా కేంద్ర బడ్జెట్ ఉంది. దీనిని ప్రవేశపెట్టిన ప్రధానిమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృతజ్ఞతలు’ అని మంత్రి లోకేశ్ అన్నారు. ఈమేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి గణనీయమైన ప్రయోజనాలు దక్కుతాయి. క్రిటికల్ మినరల్స్ కారిడార్, హైస్పీడ్ రైల్ అనుసంధానం, డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహం, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి రాయితీలు ప్రకటించారు. పర్యాటక రంగంపై కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి పెట్టారు.’ అని లోకేశ్ పేర్కొన్నారు..