Share News

సమర్థ నాయకత్వం.. స్పీడ్‌!

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:48 AM

సమర్థ నాయకత్వం, స్పీడ్‌.. ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టాయని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. గూగుల్‌ ఎంత ముఖ్య మో.. ఎంఎ్‌సఎమ్‌ఈ ...

సమర్థ నాయకత్వం.. స్పీడ్‌!

  • అవే ఏపీని ప్రపంచపటంలో నిలబెట్టాయి.. గూగుల్‌ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎమ్‌ఈలూ అంతే ముఖ్యం

  • రాష్ట్రంలో మూడు ఎకనామిక్‌ రీజియన్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం

  • ముంబైలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కాన్ఫరెన్స్‌లో మంత్రి లోకేశ్‌ వెల్లడి

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): సమర్థ నాయకత్వం, స్పీడ్‌.. ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టాయని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. గూగుల్‌ ఎంత ముఖ్య మో.. ఎంఎస్ఎమ్‌ఈ కంపెనీలూ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడు ఎకనామిక్‌ రీజియన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని, డేటా సెంటర్లపై ఉన్న భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాల సరసన అమరావతిని చేర్చుతామని ప్రకటించారు. ముంబైలో సోమవారం ‘‘అభివృద్ధికి కొత్త సరిహద్దులు’’ పేరిట బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నిర్వహించిన సదస్సులో లోకేశ్‌ ప్రసంగించారు.

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ముఖ్యం..

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ చాలా ముఖ్యమని లోకేశ్‌ చెప్పారు. విశాఖకు గూగుల్‌ ఏఐ డేటా సెంటరును తీసుకొచ్చామన్నారు. ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేవలం 17 నెలల్లోనే ప్రారంభించామన్నారు. ఇది గ్రీన్‌ఫీల్డ్‌ రంగంలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ పెట్టుబడులలో ఒకటి కాబోతోందని తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుందన్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కారు ఉందని లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పెట్టుబడులను విజయవంతంగా రాబడుతోన్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు.

ఏఐలో రాష్ట్రం టాప్‌లో ఉండాలి..

ఏఐలో రాష్ట్రాన్ని టాప్‌లో ఉంచేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని లోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలో 6.5 గిగావాట్‌ మల్టీ డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్నారు. డేటా సెంటర్ల వ్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న మరిన్ని భారీ పరిశ్రమలతో కలిసి ఒక ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చే యాలనుకుంటున్నామని చెప్పారు.


విశాఖలో ఎయిర్‌ ట్రంక్‌ ఏర్పాటు చేయండి

  • సీఈవో రాబిన్‌ ఖుదాను కోరిన మంత్రి లోకేశ్‌

ప్రఖ్యాత హైపర్‌ స్కిల్‌ డేటా సంస్థ ఎయిర్‌ ట్రంక్‌ను విశాఖలో స్థాపించాలని ఆ సంస్థ సీఈవో రాబిన్‌ ఖుదాను మంత్రి లోకేశ్‌ కోరారు. ముంబైలో సోమవారం ఎయిర్‌ట్రంక్‌ సీఈవోతో లోకేశ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని లోకేశ్‌ కోరారు. ఆరు గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కాగా, ఎయిర్‌ట్రంక్‌ ఇండియా ప్రణాళికలు, భారత్‌లో పెట్టుబడుల విస్తరణ రోడ్‌మ్యాప్‌పై ఆలోచన చేస్తున్నామని లోకేశ్‌కు ఖుదా వివరించారు.

మహారాష్ట్ర సీఎంతో లోకేశ్‌ భేటీ

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ముంబైలో సీఎం నివాసానికి వెళ్లిన లోకేశ్‌కు ఫడణవీస్‌ సాదర స్వాగతం పలికారు. ఫడణవీస్‌ను లోకేశ్‌ మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి, శ్రీవా రి ప్రతిమ అందజేశారు. ఫడణవీస్‌ లోకేశ్‌కు గణేశ్‌ ప్రతిమను బహూకరించారు. ఏపీకి వచ్చి న పెట్టుబడులు, స్పీడ్‌ ఆఫ్‌ డూ యింగ్‌ బిజినెస్‌ గురించి లోకేశ్‌ ఆయనకు వివరించారు. మహారాష్ట్ర ఐటీ, విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jun 02 , 2026 | 05:48 AM