బోత్ ఆర్ నాట్ సేమ్..
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:14 AM
వైసీపీ ఫ్యామిలీ వార్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘కన్నతల్లికి జరిగిన అవమానంపై...
కన్నతల్లికి అవమానంపై పోరాడిన లోకేశ్
ఆస్తి కోసం కన్నతల్లిని రోడ్డుకీడ్చిన జగన్: ఎక్స్‌లో సోమిరెడ్డి పోస్టు
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఫ్యామిలీ వార్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘కన్నతల్లికి జరిగిన అవమానంపై రోడ్డెక్కి పోరాడి, తండ్రిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వరకు విశ్రమించని నాయకుడు లోకేశ్. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచి, ఆ ఆస్తుల పంపకంలో చెల్లికి అన్యాయం చేసి తల్లిని రోడ్డుకు ఈడ్చి, సొంత పత్రికలో పేజీలకు పేజీలు రాయించే సుపుత్రుడు జగన్ రెడ్డి. బోత్ ఆర్ నాట్ సేమ్’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.