బండ్ల గణేశ్‌కు లోకేశ్ ఫోన్
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:19 AM
కాలినొప్పితో బాధపడుతున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను మంత్రి లోకేశ్ ఫోనులో పరామర్శించారు.
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): కాలినొప్పితో బాధపడుతున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను మంత్రి లోకేశ్ ఫోనులో పరామర్శించారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన చంద్రబాబు, జైలు నుంచి విడుదలైతే కాలినడకన తిరుమలకు వస్తానని గణేశ్ మొక్కుకున్నారు. మొక్కు చెల్లించుకునేందుకు వారం క్రితం షాద్‌నగర్ టు తిరుమల పాదయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో కాలినొప్పికి లోనవడంతో లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.