రాష్ట్ర చరిత్రకు చిహ్నం అమరావతి గ్రంథాలయం: లోకేశ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:15 AM
అమరావతిలో నిర్మించనున్న కేంద్ర గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో నిర్మించనున్న కేంద్ర గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం, పాఠశాల విద్యాశాఖపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. గ్రంథాలయ నమూనాను, నిపుణులు రూపొందించిన వీడియోను పరిశీలించి పలు సూచనలు చేశారు. ‘లైబ్రరీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలి. మన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా నిలిచేలా ఉండాలి. ఆర్కైవ్స్, ఆడిటోరియంతో పాటు 15లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉంచాల’ని లోకేశ్ స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనం, డీఎస్సీ అం శాలపైనా చర్చించారు. ఇందులో ఉన్నతాధికారులు కోన శశిధర్, వీ విజయరామరాజు, బీ శ్రీనివాసరావు, దీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ పాల్గొన్నారు.