రాజ్ కసిరెడ్డికి షాక్
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:22 AM
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి (ఏ1) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
మద్యం స్కామ్‌లో బెయిల్ పిటిషన్ తిరస్కృతి
ఆర్థిక నేరాల్లో నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం: హైకోర్టు
అమరావతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి (ఏ1) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. మరో నిందితుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సైతం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఇతర నిందితులతో కలిసి పన్నిన కుట్రలో భాగంగా రాజ్ కసిరెడ్డి తన కార్యాలయంలో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కసిరెడ్డి, ఆయన సిండికేట్‌కు ముడుపులు చెల్లించిన మద్యం బ్రాండ్‌లకు మాత్రమే ఆర్డర్స్ ఫర్ సప్లై ఇచ్చినట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. కొత్తమద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే 2020లో అదన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. నిందితుడు ముప్పిడి అవినాశ్(ఏ7) ద్వారా కసిరెడ్డి దీనిని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎ్‌సబీసీఎల్) నుండి కసిరెడ్డి, అవినాశ్‌రెడ్డిలకు రూ.750కోట్లు అందాయని ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఉనికిలో లేని షెల్ కంపెనీలకు మళ్లించారు. షెల్ కంపెనీల నుండి రూ.135కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. వాట్సప్ చాట్, కాల్‌డేటా, ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదికలు పరిశీలిస్తే ఈ అక్రమ లావాదేవీల్లో కసిరెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమౌతుంది. కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేస్తే పరారీలో ఉన్న అవినాశ్‌రెడ్డిని చట్టం నుండి తప్పించే అవకాశం ఉంది. దర్యాప్తు నకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. కసిరెడ్డి గతంలో విదేశాలకు వెళ్లి దర్యాప్తు నుండి తప్పించుకొనేందుకు ప్రయత్నించినట్లు గుర్తించాం. భారీ స్థాయిలో ప్రజా సొమ్మును దారి మళ్లించారు. ఇలాంటి ఆర్థిక నేరాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం’’ అని కోర్టు పేర్కొంది. ఈ నేపఽథ్యంలోనే బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి పేర్కొన్నారు.
జైలునుంచి చెవిరెడ్డి విడుదల