Share News

ACB Court: ‘లిక్కర్‌’ గ్యాంగ్‌కు 30 వరకు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:16 AM

మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న తొమ్మిది మందికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 30వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది.

ACB Court: ‘లిక్కర్‌’ గ్యాంగ్‌కు 30 వరకు రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న తొమ్మిది మందికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 30వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, చెరుకూరి వెంకటేష్‌ నాయుడు, బూనేటి చాణక్య, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌ కృష్ణ, అనిల్‌ చోక్రా, రోణక్‌ కుమార్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి రిమాండ్‌ను 30వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. బెయిల్‌పై ఉన్న పి.కృష్ణమోహన్‌ రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనంజయ్‌రెడ్డి మాత్రం వాయిదాకు హాజరుకాలేకపోతున్నామని ఆబ్‌సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Jan 17 , 2026 | 04:16 AM