Share News

మద్యం స్కాంలో జగన్‌ అరెస్టు ఖాయం: దేవినేని ఉమ

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:28 AM

మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ ప్రారంభం కావడంతో తాడేపల్లి ప్యాలె్‌సలో వణుకు మొదలైందని, ఈ స్కాంలో జగన్‌ రెడ్డి అరెస్టు ఖాయమని..

మద్యం స్కాంలో జగన్‌ అరెస్టు ఖాయం: దేవినేని ఉమ

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ ప్రారంభం కావడంతో తాడేపల్లి ప్యాలె్‌సలో వణుకు మొదలైందని, ఈ స్కాంలో జగన్‌ రెడ్డి అరెస్టు ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్ప సినిమా స్మగ్లింగ్‌ను మించి జగన్‌ లిక్కర్‌ స్కాం నడిచిందని, మామిడికాయ పెట్టెల్లో రూ.కోట్ల నోట్ల కట్టను నియోజకవర్గాలకు తరలించి, ఆ డబ్బుతో 175కి 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని సిద్ధం సభల్లో విర్రవీగారని అన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 05:28 AM