‘జగన్’ జైలుకు లిక్కర్ నిందితుల క్యూ..!
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:00 AM
చంచల్‌గూడ కేంద్ర కారాగారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నిందితులు ఒక్కొక్కరుగా ఈ జైలుకు క్యూ కడుతుండడమే.
ఉభయ రాష్ట్రాల్లో సర్వత్రా చర్చ
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): చంచల్‌గూడ కేంద్ర కారాగారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నిందితులు ఒక్కొక్కరుగా ఈ జైలుకు క్యూ కడుతుండడమే. మద్యం అక్రమ రవాణా స్కాం కేసు దర్యాప్తులో వారం వ్యవధిలో ముగ్గురు కీలక నిందితులను.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్‌కుమార్‌ను ఈడీ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించింది. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ఇదే జైలులో 16 నెలలపాటు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ నిందితులు కూడా ఇదే జైలుకు వస్తుండడం ఆసక్తికరంగా మారింది.