కోర్టుకు ‘లిక్కర్’ కార్లు
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:34 AM
ఎన్నికల సమయంలో మద్యం కుంభకోణం డబ్బులను తరలించిన కారులను సిట్ అధికారులు శనివారం విజయవాడ కోర్టుకు తరలించారు.
ఎన్నికల కోసం డబ్బు తరలించేందుకు ప్రత్యేక అరలు
విజయవాడ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో మద్యం కుంభకోణం డబ్బులను తరలించిన కారులను సిట్ అధికారులు శనివారం విజయవాడ కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత నిందితులు ఇచ్చిన సమాచారంతో ఒక హోండా సిటీ, 2 బీఎండబ్ల్యూ కారులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇవి పోలీసు కమిషనర్ కార్యాలయం ఆవరణలో ఉన్నాయి. ఈ వాహనాలను తీసుకురావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిట్ సిబ్బంది ఈ మూడు కారులను కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు కార్యాలయ సిబ్బంది ఈ వాహనాలను పరిశీలించారు. నోట్ల కట్టలను అమర్చడానికి బీఎండబ్ల్యూ కారుల్లో ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేయించారు. ఈ కారులను సిట్ సిబ్బంది కోర్టుకు అప్పగించారు.