లైనిక్స్ కండక్టర్ల టెండర్లు రద్దు
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:03 AM
విద్యుత్తు పంపి ణీ నష్టాలను తగ్గించేందుకు ఉద్దేశించిన లైనిక్స్ కండక్టర్ల టెండర్లలో ఊరికో రేటును నిర్ణయించడంపై ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి విజయానంద్ స్పందించారు.
‘ఊరికో రేటు’పై సీఎస్ సీరియస్
ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు పంపి ణీ నష్టాలను తగ్గించేందుకు ఉద్దేశించిన లైనిక్స్ కండక్టర్ల టెండర్లలో ఊరికో రేటును నిర్ణయించడంపై ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి విజయానంద్ స్పందించారు. లైనిక్స్ కండక్టర్ల రేటును విశాఖపట్నం జిల్లాలో ఓ రకంగా నెల్లూరు లో మరో రకంగా ఆ రేట్లు ఉండటంపై ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 21న ‘ఊరికో రేటు’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన సీఎస్ మొత్తం లైనిక్స్ కండక్టర్ల టెండర్ల వ్యవహారంపై అధికారులను వివరాలు కోరారు. ఒకే రకమైన కండక్టర్లకు 3 టెండర్లలో 3 వేర్వేరు ధరలను పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెండర్లను రద్దు చేసి ఏసీఎ్‌సఎస్ కండక్టర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి మళ్లీ టెండర్లను పిలవాలని ఆదేశించా రు. సీఎస్ ఆదేశాలతో ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి, మరోసారి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నెల్లూరు జిల్లాలోని రాచర్లపాడు-కావలి మధ్య 132 కేవీ లైన్‌లో 76 కిలోమీటర్ల మేర ఏసీఎ్‌సఎస్ లైనిక్స్ కండక్టర్ ఏర్పాటు చేసేందుకు కిలోమీటరుకు రూ.2,43,430గా ధరను నిర్ణయించగా, విశాఖపట్నం జిల్లాలో పిలిచిన టెండరులో కిలోమీటరుకు రూ. 2,58,095లుగా ధరను నిర్ణయించారు. ఆంధ్రజ్యోతి కథనం ప్రచురితమైన రోజే కందుకూరు-కావలి లైనులో 100 కిలోమీటర్లకు ఏసీఎ్‌సఎస్ లైనిక్స్ కండక్టర్ల ఏర్పాటుకు పిలిచిన టెండర్లలో కిలోమీటరుకు రూ.2,51,486గా పేర్కొన్నారు.