సర్వేలకే పరిమితమా?
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:30 PM
ప్రభుత్వాలు ఎన్ని మారినా.. అధికారులు ఎవరు ఉన్నా గాజలదిన్నె ప్రాజెక్టు పర్యాటక రంగం అభివృద్ధి ముందుకు సాగడం లేదని విమర్శలు వినవస్తున్నాయి.
కంటి తుడుపు చర్యలు సర్వేలు
పర్యాటకంగా అభివృద్ధికి
నోచుకోని జీడీపీ
గోనెగండ్ల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు ఎన్ని మారినా.. అధికారులు ఎవరు ఉన్నా గాజలదిన్నె ప్రాజెక్టు పర్యాటక రంగం అభివృద్ధి ముందుకు సాగడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. గతంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలు అఽధికారంలో కి వచ్చిన ప్రతి సారి గాజులదిన్నెను పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామని ప్రకటనలు చేయడం కంటి తుడుపు చర్యగా సర్వేలు జరపడం పరిపాటిగా మారందని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికి నాలుగుసార్లు టూరిజం శాఖ వారు సర్వేలు జరపడం నివేదిక తయారు చేసి పం పడం పరిపాటి గా మారింది. గత ఏడాది నవంబరు 19న గాజులదిన్నె ప్రాజెక్ట్ పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు గాను ఏపీ టూరిజం శాఖ ఏఈ రాజే్‌షకుమార్, సర్వేయర్లు సాజిత, సుధారాణి ప్రాజెక్టు ప్రాంతంలో ఉండే భూమిని సర్వే చేశారు.
100 రోజుల ప్లానింగ్ కింద రూ.3కోట్లు..
గత ఏడాది 100 రోజుల ప్లానింగ్ కింద రూ.3కోట్లు నిధులను విడుదల చేయాలని అధికా రులు ప్రపోజల్ తయారు చేశా రు. నిధులు విడుదల అయితే నిధులతో పర్యాటకుల కోసం ఒక రెస్టారెంట్, ప్రాజెక్టు నీటిలో విహరించేందుకు బోట్‌లు, టాయిలెట్‌లు, పిల్లలు ఆడుకునేందుకు కావలసిన సామగ్రి, దివ్యాంగులకు, పర్యాటకులకు ప్రత్యేక బాతరూములు ఏర్పాటుకు సర్వేలు చేసినట్లు వారు తెలిపారు. సర్వేలు జరిపి పది నెలలు కావస్తున్నప్పటికీ ఏ మాత్రం పనులు ప్రారంభం కాలేదు. అయితే గత ఏడాది సర్వేలు జరిపిన అధికారులు రూ.50లక్షల విలువవైన పనులకు గాను నివేదిక తయారు చేసి కలెక్టర్ కు అందజేశారని తెలిసింది. ప్రస్తుతం ఫైల్ కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉందని తెలుస్తుంది.
పర్వదినాల్లో పర్యాటకులతో కిటకిట
కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా కొనసాగుతుంది. ఇక్కడి చెట్లు, ఆనకట్ట, నీటి అలలు చల్లగాలి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పర్వదినాలలో ప్రాజెక్టు పర్యాటకులతో కిటకిటలాడుతుంది. కర్నూలు, బెళగల్, గుడూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల నుంచి పర్యటకు వచ్చి సాయంత్రం వరకు గడిపి వెళ్తుంటారు. వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు అంటూ చేయలేదని విమర్శలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో జీడీపీ పర్యాటక రంగంగా వెలుగొందుతుందని పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.