దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:04 AM
బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో శుక్రవారం తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.
విశాఖపట్నం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో శుక్రవారం తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉత్తరకోస్తా, ఏజెన్సీ ప్రాంతాలు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం పది గంటల వరకు దట్టంగా మంచు కురిసింది. చలి తీవ్రత కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరకోస్తాలో పొగమంచు కురుస్తుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.