పర్యావరణాన్ని కాపాడుదాం
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:34 PM
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఈ
పత్తికొండ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా పత్తికొండ సుస్వాగతం బోర్డు దగ్గర గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారి ప్రక్కన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ పత్తికొండను అందరం బాధ్యతగా తీసుకుందామని, కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అలాగే జేఎమ్ తండా, పట్టణంలో, పీర్ల చావడి, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్ రెడ్డి, వెంకటపతి, లోక్‌నాథ్ అవరపు శంకర్, హోటల్ శ్రీనివాసులు, డాక్టర్ కల్పన, కాంట్రాక్టర్ మురళి, డీఆర్డీ శేషయ్య, నాయకులుపాల్గొన్నారు.