Share News

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేద్దాం

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:44 PM

అన్ని ప్రభు త్వ శాఖల సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయ వంతం చేద్దామని ఉత్సవాల అధికారి నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాథ్‌ కోరారు.

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న ఆర్డీవో విశ్వనాథ్‌

నంద్యాల రూరల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : అన్ని ప్రభు త్వ శాఖల సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయ వంతం చేద్దామని ఉత్సవాల అధికారి నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాఽథ్‌ కోరారు. శుక్రవారం నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన, మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహనంది క్షేత్రంలో పిబ్రవరి నెల 13 నుంచి 18 వరకు జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అదికారులతో మొదటి సమస్వయ సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ పట్టణంలో కూడా పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు దూర ప్రాతాలనుంచి నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. పారిశుధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. పోలీసులు, మున్సిపల్‌, విద్యుత, వైద్యశాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో కమిషనర్‌ బండి శేషన్న, డీఎల్‌పీవో రాంబాబు, తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో సుగుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:44 PM