Share News

మోదీ ప్రభుత్వంపై పోరాడుదాం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:54 PM

భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ రంగాలకు తాకట్టు పెట్టిన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటాలు చేద్దామని రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య పిలుపునిచ్చారు.

మోదీ ప్రభుత్వంపై పోరాడుదాం
పత్తికొండలో జెండాను ఎగుర వేస్తున్న రామచంద్రయ్య

పత్తికొండ టౌన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ రంగాలకు తాకట్టు పెట్టిన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటాలు చేద్దామని రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. శనివారం పత్తికొండలో ఏఐకేఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న అఖిలభారత కిసాన్‌ సభ నేటితో 90 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. ఏఐకేఎస్‌ ఆవిర్భావం నుంచి రైతాంగ పోరాటాలు, హక్కుల కోసం పోరుసల్పి ఎన్నో విజయాలను సాధించిందన్నారు. కిసాన్‌సభ కేవలం ఆర్థిక సమస్యలపైనేగాకుండా ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చేపట్టే పోరాటాల్లో రైతు లు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజాసాహెబ్‌, నియోజకవర్గ కార్యదర్శి సురేంద్రకుమార్‌, ప్రజా సంఘాల నాయకులు గురుదాస్‌, రామాంజినేయులు, కారుమంచి, రవికుమార్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

చిన్నహుల్తిలో..

అఖిలభారత కిసాన్‌సభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిన్నహుల్తి గ్రామంలో శనివారం ఘనంగా జరిగాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను జిల్లా నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి ఎగుర వేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెద్దహుల్తి కారప్ప, బాషా తదితరులు పాల్గొన్నారు.

ఆలూరులోని కోటవీధిలో..

ఆలూరు రూరల్‌: రైతుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నట్లు రైతు సంఘం ఏఐకేఎస్‌ (ఆల్‌ ఇండియా కిసాన్‌ సమితి) రైతు సంఘం మండల కార్యదర్శి యు.ఈరన్న అన్నారు. శనివారం ఆలూరులోని కోటవీధిలో రైతు సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో సాగు భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా దారాదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో పరమే్‌షగౌడ్‌, గుండన్న, వీరేష్‌, వెంకటేష్‌, రంగస్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:54 PM