Leopard Sighting: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:33 AM
తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురిచేసింది.
తిరుపతి(కపిలతీర్థం), జనవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురిచేసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కొద్దిరోజులుగా చిరుత సంచారం తగ్గినట్లే అనిపించినా.. ఇప్పుడు మళ్లీ చిరుత కనిపించడంతో కలకలం రేగింది. భక్తుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. 500వ మెట్టు వద్ద చిరుత పాదముద్రలను గుర్తించారు. వీటి ఆధారంగా చిరుత అడవిలోకి వెళ్లిపోయినట్టు నిర్ధారించారు. నడక మార్గంలో భక్తులను కొద్దిసేపు ఆపి గుంపులు గుంపులుగా పంపారు.