తంగరడోనలో చిరుతపులి!
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:50 PM
మండలంలోని తంగరడోన గ్రామంలో చిరుత పులి సంచరిస్తోంది. బుధవారం గ్రామ సమీప కొండలో చిరుతపులి కోతులపై దాడి చేస్తున్న దృశ్యాలను గ్రామస్థులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
ఆస్పరి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తంగరడోన గ్రామంలో చిరుత పులి సంచరిస్తోంది. బుధవారం గ్రామ సమీప కొండలో చిరుతపులి కోతులపై దాడి చేస్తున్న దృశ్యాలను గ్రామస్థులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. మూడు రోజులుగా అలిగేర, తురువగల్లు, తంగరడోన గ్రామాల కొండల్లో పులి తిరుగుతూ జంతువులపై దాడి చేస్తోందని, ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని ఆ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మొత్తం మూడు చిరుత పులులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.