వెటర్నరీ వర్సిటీలో చిరుత!
ABN , Publish Date - May 26 , 2026 | 05:21 AM
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో సోమవారం ఓ చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం ఉదయం వర్సిటీ క్లినికల్ సైన్సెస్ బ్లాక్ భవనంలో..
క్లినికల్ సైన్సెస్ బ్లాక్ భవనంలోకి రాక
బంధించి రెస్క్యూ సెంటర్‌కు తరలింపు
తిరుపతి రూరల్, మే 25(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో సోమవారం ఓ చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం ఉదయం వర్సిటీ క్లినికల్ సైన్సెస్ బ్లాక్ భవనంలో విధులకు హాజరైన ఓ మహిళా ఉద్యోగి లోపల చిరుత ఉండడాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు అక్కడకు చేరుకుని చిరుతను బంధించి పరిశీలన, సంరక్షణ నిమిత్తం ఆర్‌ఆర్‌ఆర్‌టీ వాహనం ద్వారా ఎస్వీ జూపార్కులోని రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అది సుమారు ఏడాది వయస్సున్న ఆడ చిరుతగా నిర్ధారించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చిరుతను సురక్షితంగా తిరిగి అటవీప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.