Share News

Srisailam: ఇంటి ఆవరణలోకి చిరుత

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:34 AM

శ్రీశైల క్షేత్ర శివార్లలో నిత్యం పులులు, చిరుతల సంచారం జరుగుతూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున పాతాళగంగ రోడ్డు మార్గంలో నివాసం ఉన్న సత్యనారాయణ శర్మ...

Srisailam: ఇంటి ఆవరణలోకి చిరుత

  • శ్రీశైలంలో కలకలం.. సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు

శ్రీశైలం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్ర శివార్లలో నిత్యం పులులు, చిరుతల సంచారం జరుగుతూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున పాతాళగంగ రోడ్డు మార్గంలో నివాసం ఉన్న సత్యనారాయణ శర్మ ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. మోషన్‌ డిటెక్షన్‌ అలారం (కదలికలను గుర్తించే అలారం) మోగటంతో మేల్కొన్న సత్యనారాయణ అప్రమత్తమై సీసీ ఫుటేజీని పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు. కల్యాణకట్ట, మల్లికార్జున సత్రం, రజక సత్రం తదితర ప్రాంతాల్లో చిరుత తిరిగిన జాడలు కనిపించాయని పలువురు యాత్రికులు అంటున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న క్షేత్ర శివారు ప్రాంతాల్లో నివాసం ఉండే వారు, భక్తులు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌వో) పరమేశు హెచ్చరించారు. దేవస్థానం అధికారులు కూడా ఎప్పటికప్పుడు మైక్‌ సెట్ల ద్వారా వన్యమృగాల సంచారంపై భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో రక్షణ చర్యలు పెంచాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jan 03 , 2026 | 05:36 AM