Share News

సీసీ కెమెరాకు చిక్కిన పులి

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:47 AM

ఏలూరు జిల్లా ఏజెన్సీ వాసులకు నాలుగు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి కదలికలు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు చిక్కాయి.

సీసీ కెమెరాకు చిక్కిన పులి

  • నాగులగూడెం పరిసరాల్లో సంచారం

బుట్టాయగూడెం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఏజెన్సీ వాసులకు నాలుగు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి కదలికలు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు చిక్కాయి. బుట్టాయగూడెం మండలం నాగులగూడెం, అంతర్వేదిగూడెంలో గురువారం ఒక్క రోజే ఈ పులి ఐదు ఆవులను చంపేసింది. ఈ నేపథ్యంలో నాగులగూడెంలో రెండు ఆవులను చంపిన ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆవుల మృత కళేబరాల వద్దకు శుక్రవారం తెల్లవారుజామున పులి వచ్చి తింటున్న దృశ్యాలు ఈ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో పులి పాదముద్రల ఆధారంగా దాని ఆచూకీ కనిపెట్టేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు శుక్రవారం గాలింపు చేపట్టారు. పశువులు ఉంటున్న పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. పులి భయంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడం లేదు. దానిని త్వరగా బంధించాలని కోరుతున్నారు.

Updated Date - Jan 24 , 2026 | 04:47 AM