యాపిల్‌ను దాటేసిన నిమ్మ ధర
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:53 AM
ముదురుతున్న ఎండలతో నిమ్మకాయల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా నిమ్మకాయలు వినియోగిస్తుండటంతో డిమాండ్ బాగా పెరిగింది.
డక్కిలి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ముదురుతున్న ఎండలతో నిమ్మకాయల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా నిమ్మకాయలు వినియోగిస్తుండటంతో డిమాండ్ బాగా పెరిగింది. దీంతో నిమ్మ ధర.. యాపిల్‌ను కూడా దాటేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో యాపిల్ కిలో రూ.160 పలుకుతుండగా గూడూరు మార్కెట్‌లో మంగళవారం నిమ్మకాయ లు కిలో రూ.180 పలికి రికార్డు సృష్టించాయి. ఎండల తీవ్రతతో డిమాండ్ పెరగడం, దిగుబడి తగ్గడమే ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే నెలలో ధరలు ఇంకా పెరగవచ్చని వ్యాపా రులు అంచనా వేస్తున్నారు.