ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:54 AM
మారుమూల గ్రామాల ప్రజలకు సైతం న్యాయ సేవలు అందినప్పుడే వారికి చట్ట సంబంధిత ఫలాలు అందుతాయని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్...
హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాల ప్రజలకు సైతం న్యాయ సేవలు అందినప్పుడే వారికి చట్ట సంబంధిత ఫలాలు అందుతాయని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన, న్యాయ సహాయం, హక్కులపై చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హైకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ 13 ఫోర్స్ అర్బేనియా న్యాయసేవ మొబైల్ వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రతి జిల్లాలోనూ ఉన్న న్యాయసేవాధికార సంస్థకు ఒక్కో వాహనాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లీసాగిల్, జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ ఆర్.రఘునందనరావు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి మాలతి, న్యాయసేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు పాల్గొన్నారు.