పత్తిపై దిగుమతి సుంకాన్ని ఉపసంహరించండి
ABN , Publish Date - May 20 , 2026 | 05:26 AM
దేశీయ అవసరాలకు కొరత లేకుండా చూడటంతో పాటు ధరల స్థిరత్వం కోసం పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకోవాలని..
కేంద్ర మంత్రి గోయల్‌కు రామ్మోహన్, లావు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): దేశీయ అవసరాలకు కొరత లేకుండా చూడటంతో పాటు ధరల స్థిరత్వం కోసం పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. పత్తి ఎగుమతులపై అక్టోబరు 31 వరకు తాత్కాలిక నియంత్రణలు విధించాలని, సీసీఐ నిల్వలను మధ్యవర్తులకు కాకుండా నేరుగా ఉత్పత్తిదారులకే సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్ర వ్యవసాయ, ఎగుమతి, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై మంగళవారం వారు కేంద్ర మంత్రితో చర్చించారు. దేశీయ మార్కెట్‌లో నాణ్యమైన పత్తి లభ్యతపై ఎదురవుతున్న సవాళ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా ప్రభుత్వం ఇటీవల విధించిన కొత్త టారిఫ్ కారణంగా ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు.